వ్యక్తిగత సెలవులపై పరిమితులు వద్దు

Nov 27,2024 21:44 #andhrapradesh, #tnsf
  • తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల సెలవులపై విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో, మండలంలోని సిబ్బందిలో 7-10 శాతం మాత్రమే వాడుకోవాలని షరతులు విధించడం సరికాదని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం తెలిపింది. అత్యవసర, ఆరోగ్యకారణాలతో ఉపాధ్యాయులు సిఎల్‌, ఎస్‌సిఎల్‌ఎస్‌లు వినియోగించుకోవడంపై ఆంక్షలు విధించడం సమంజం కాదని ఆ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్‌, రామశెట్టి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంక్షలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాల సమయాల పెంపు, రెసిడెన్షియల్‌ పద్ధతి శిక్షణ వంటి ప్రయోగాలతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొదని కోరారు.

➡️