ఇఎపిసెట్‌లో ఫలితాలు విడుదల

Jun 12,2024 10:03 #EAP set, #released, #Results

టాప్‌టెన్‌లో అబ్బాయిలే అధికం
ఇంజినీరింగ్‌, ఫార్మసీలో అత్యధికంగా బాలికలు… వ్యవసాయంలో బాలురు ఉత్తీర్ణత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంజనీరింగ్‌లో బాలికలు, వ్యవసాయంలో బాలురు అత్యధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు. అయితే, ఈ రెండు విభాగాల్లోని టాప్‌టెన్‌లో మాత్రం బాలురే పై చేయి సాధించారు. ఈ మేరకు రూపొందించిన ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె. రామమోహన్‌రావు, జెఎన్‌టియు కాకినాడ విసి ప్రొఫెసర్‌ జివిఆర్‌ ప్రసాదరాజు మంగళవారం విజయవాడలోని ఒక ప్రైవేటు హోటల్‌లో విడుదల ఇంజనీరింగ్‌, ఫార్మాసి విభాగంలో 2,74,213 మంది దరఖాస్తు చేసుకోగా 2,58,374 మంది పరీక్ష రాశారు. వీరిలో 1,95,092(75.51శాతం)మంది అర్హత సాధించారు. బాలురు 73.93శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు వారి కంటే 3.72శాతం అదనంగా 77.65శాతం ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్‌ విభాగంలో 88,638 మంది దరఖాస్తు చేసుకోగా 80,764 మంది పరీక్ష రాశారు. వీరిలో 70,352(87.11శాతం) మంది అర్హత సాధించారు. బాలురు 87.98శాతం, బాలికలు 86.81 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మొదటి పది స్థానాలు బాలురే సాధించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ఉమామహేశ్వరి, కార్యదర్శి నజీర్‌ అహ్మద్‌, సెట్ల కన్వీనర్‌ ఎం సుధీర్‌ రెడ్డి, అసిస్టెంట్‌ సెట్ల కన్వీనర్‌ మాధవి, ఇఎపిసెట్‌ కన్వీనర్‌ వెంకట రెడ్డి తదితరులు పాల్గన్నారు.

టాప్‌ టెన్‌ ర్యాంకర్ల వివరాలు

ఇంజనీరింగ్‌

ర్యాంకు విద్యార్ధి పేరు                                  మార్కులు
1. మాకినేని జిష్ణుసాయి                            97.0022
2. మురసాని సాయియశ్వంత్‌ రెడ్డి             96.8358
3. భోగాలపల్లి సందేష్‌                               96.4285
4. పాలగిరి సతీష్‌ రెడ్డి                               96.0330
5. కోమటినేని మనీష్‌ చౌదరి                      95.3305
6. ఇప్ప లక్ష్మీనరసింహారెడ్డి                      95.2584
7. గోళ్ల లేఖ హర్ష                                      95.1121
8. పుట్టి కుశల్‌ కుమార్‌                            94.3563
9 పరమరధ్యుల సుశాంత్‌                         94.2113
10. కోమిరిశెట్టి ప్రభాస్‌                              93.9100

అగ్రికల్చర్‌
ర్యాంకు విద్యార్ధి పేరు                            మార్కులు
1. యేళ్లు శిరీష రెడ్డి                              93.4463
2. పూల ద్వివతేజ                               92.9278
3. వడ్లపూడి ముఖేష్‌ చౌదరి                92.7966
4. పేరా సాత్విక్‌                                   92.6212
5. ఆలూరు ప్రణీత                               91.8895
6. గట్టు భానుతేజసాయి                      91.4172
7. పెన్నమడ నీహరిక రెడ్డి                    90.9382
8. శంబంగి మనోఅభిరామ్‌                   90.6581
9 శరగదం పావని                               90.4518
10. నగుదసారి రాధాకృష్ణ                   90.3378

➡️