ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎల్బీ స్టేడియం సిద్ధం…

Dec 7,2023 11:39 #Congress, #Telangana
revanth reddy oath

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎల్బీ స్టేడియం వేదికగా రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 80 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. స్టేడియం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, సీసీ కెమెరాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నామని సెంట్రల్ జోన్ డీసీపీ తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్‌ నాయకులు కె.నారాయణ, సయ్యద్‌ అజీజ్‌ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు రేవంత్‌ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం రేవంత్ రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని తన ఛాంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు : తమిళనాడు సీఎం స్టాలిన్
ఇవాళ తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డికి తమిళనాడు సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. రేవంత్ తో ఫోన్ లో కూడా స్టాలిన్ మాట్లాడారు. కాగా రేవంత్ ప్రమాణస్వీకారానికి స్టాలిన్ కూడా ఆహ్వానం పంపారు. కానీ తమిళనాడులో వర్షాలు బీభత్సం సృష్టి్ంచడంతో ఆయన హాజరు కావడం లేదు.

➡️