ముద్దాడ రవిచంద్రకు కెవిపిఎస్ వినతి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :స్టడీ సర్కిల్స్‌ను పునరుద్ధరించడంతోపాటు డిఎస్‌సికి ఉచిత కోచింగ్ ఇవ్వాలని దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ వర్గాల నిరుద్యోగ యువతీ యువకులకు హాస్టల్‌తో కూడిన ఉచిత కోచింగ్ ఇప్పించాలని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సిఎంఓ ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేదా మహాత్మా జ్యోతిబాఫూలే స్టడీ సర్కిల్స్ పేరుతో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి, ఏలూరుల్లో సొంత భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో ప్రైవేటు బిల్డింగ్స్‌లో నడిచేవని గుర్తు చేశారు. గత వైసిపి ప్రభుత్వం వీటిని పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్స్ పునరుద్ధరణ చేయడంతోపాటు గిరిజనుల కోసం విశాఖ, విజయవాడల్లో స్టడీ సర్కిల్స్‌పెట్టి ఉచిత శిక్షణ ఇవ్వాలని కెవిపిఎస్ విజ్ఞప్తి చేసింది. స్టడీ సెంటర్ల నిర్వహణ కోసం కెవిపిఎస్ ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.
