ప్రజాశక్తి- అమరావతి : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ రిట్‌ను అత్యవసరంగా విచారణ జరపాలని వర్మ లాయర్ కోరారు. దీంతో, బుధవారం విచారించేందుకు జస్టిస్ విఆర్‌కె కపాసాగర్ అనుమతిచ్చారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లను కించపర్చేలా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు పెట్టారంటూ అనకాపల్లి జిల్లా రావికమతం, ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు వేర్వేరుగా చేసిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసులో వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.