ఆమంచి నామినేషన్‌ ఆమోదం – ఆర్‌ఒ సూర్యనారాయణరెడ్డి

ప్రజాశక్తి – చీరాల (బాపట్ల జిల్లా)
కాంగ్రెస్‌ పార్టీ చీరాల అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ ఎన్నికల అధికారులు ఆమోదించారు. విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదని ఎ.రామకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఆమంచి నామినేషన్‌ను అధికారులు పెండింగ్‌లో పెట్టిన విషయం విదితమే. ఆర్‌ఒ సూర్యనారాయణరెడ్డి శనివారం దీనిపై స్పష్టత ఇచ్చారు. ప్రజాప్రతినిధ్య చట్టంలోని 1951 సెక్షన్‌ 8, 8ఏ ప్రకారం నామినేషన్లను తిరస్కరించడం, ఆమోదించటానికి సంబంధించి పూర్తిగా విశదీకరించామని, ఎన్నికల నిబంధనల ప్రకారం రామకృష్ణ ఫిర్యాదు చెల్లుబాటు కాకపోవడంతో ఆమంచి నామినేషన్‌ను స్క్రూట్నీ చేసి ఆమోదించామని తెలిపారు.

➡️