- ఒకరికి తీవ్ర గాయాలు
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : అనకాపల్లి, విశాఖపట్నం జాతీయ రహదారి కూర్మన్నపాలెం స్టీల్ సిటీ జంక్షన్ వద్ద గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు అక్కడిక్కడే మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిపో నుంచి బయటకు వస్తున్న ఆర్టీసీ వెనుక ఉన్న బైక్ను అనకాపల్లి వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఢకొీట్టడంతో ఈ ప్రమాదం జరిగిరనట్లు తెలిపారు. మృతి చెందిన వారు. దువ్వాడకు చెందిన బి.రాము (45), జి.శ్రీను (45)గా గుర్తించారు. మూడవ వ్యక్తి తీవ్రగాయలవ్వడంతో పోలీసులు కెజిహెచ్‌కు తరలించారు. మృతదేహాలను కెజిహెచ్ మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.