రోడ్డు ప్రమాదం – మహిళా ఎస్‌ఐ, మరొకరు మృతి

గొల్లపల్లి (జగిత్యాల) : రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్‌ఐ మృతి చెందిన ఘటన మంగళవారం జగిత్యాలలో జరిగింది. ఎస్‌ఐ శ్వేత నడుపుతున్న కారు గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. ఆ తరువాత చెట్టును బలంగా ఢీకొట్టడంతో ఎస్‌ఐతోపాటు మరొకరు మృతి చెందారు. ఎస్‌ఐ కారును నడుపుతూ ఆర్నకొండ నుంచి జగిత్యాలకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆమె మృతదేహాన్ని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. జగిత్యాల పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో శ్వేత విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమె కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్‌, పెగడపల్లిలో ఎస్‌ఐగా పనిచేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️