సహాయక చర్యల్లో రోబో టెక్నాలజీ

Mar 11,2025 23:52 #acidents, #death bodys, #SLBC Tunnel
  • సొరంగంలో 14 కిలోమీటర్ల చివరన కదులుతున్న పైకప్పు

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఎస్‌ఎల్‌బిసి సొరంగంలో ప్రమాదపుటంచున రెస్క్యూ టీం సభ్యులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 14 కిలోమీటర్ల చివరన పైకప్పు కదులుతున్నా.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కార్మికుల ఆచూకీ కోసం రాత్రింబవళ్లు పని చేస్తున్నారు. మంగళవారం ఉదయం సొరంగంలోకి రోబోను తీసుకుని రెస్క్యూ టీం వెళ్లింది. డి-1, డి-2, డి-3 దగ్గర ఆపరేషన్‌ మొదలుపెట్టి డి-2 దగ్గర ఎనిమిది మీటర్ల మేర మట్టిని తీశారు. ఇక్కడ కార్మికుల ఆనవాళ్లు కనిపించినట్టు తెలుస్తోంది. అయినా టిబిఎం మిషన్‌ ఉండటంతో దానిని గ్యాస్‌ కట్టర్‌ ద్వారా తొలగించి ముందుకు వెళ్లాల్సి ఉంది. టిబిఎం మిషన్‌ మట్టిలో కూరుకపోవడంతో దానిని వెలికితీయడం కష్టంగా మారిందని అధికారులు తెలిపారు. టిబిఎం మిషన్‌ ముందు 15 మీటర్లు డేంజర్‌ జోన్‌గా అధికారులు చెబుతున్నారు. సొరంగం కింది భాగాన తవ్వుతుంటే పైభాగం నుంచి మట్టి, నీళ్లు వస్తున్నాయి. రోజుకు మూడు షిఫ్ట్‌ల్లో 110 మంది చొప్పున రెస్క్యూ టీం సభ్యులు పనిచేస్తున్నారు. 18 రోజుల నుంచి జరుగుతున్న సహాయక చర్యల్లో ఒక కార్మికుని మృతదేహం బయటపడగా.. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

➡️