ఖాళీ కంచాలతో రాక్ సిరామిక్స్ కార్మికుల నిరసన 

కార్మికులను తొలగించి నేటికి 88రోజులు
ప్రజాశక్తి – సామర్లకోట : అక్రమ తొలగింపులకు నిరసనగా రాక్ సిరామిక్స్ గేటు ముందు సిఐటియు ఆధ్వర్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు ఖాళీ కంచాలతో శుక్రవారం నిరసన తెలియజేసారు. ఈ సందర్బంగా కార్మికులు చంద్రశేఖర్ మాట్లాడుతూ గేటు ముందు కార్మికుల పోరాటం 88వ రోజుకు చేరుకుందని అన్నారు. కార్మికులను అక్రమంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించిందన్నారు. 5 సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు జరిగినా యాజమాన్యం మంకుపట్టుదలతో వ్యవహరిస్తుందన్నారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతుంటే కార్మిక శాఖ అధికారులు ఎందుకు కార్మికులను విదులోకి తీసుకోవీలని ఆదేశించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కి కూడా కంపెనీ యాజమాన్యం అబద్దాలు చెబుతున్నదని ఎద్దేవ చేసారు. నిన్న జరిగిన జాయింట్ మీటింగ్ లో కార్మిక శాఖ మంత్రితో చర్చలకు అవకాశం ఇవ్నాలని కోరడం జరిగిందని తెలిపారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కలెక్టర్ ను కలసి సమస్యను వివరిస్తానని తెలిపారని అన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డి.క్రాంతి కుమార్, చంద్ర‌శేఖ‌ర్‌, గంగాధర్, సతీష్, రామకృష్ణ, వరప్రసాద్, మల్లికార్జునరావు, గంగాధర్, క్రాంతి, మంగారావు,అర్జున్ రావు, మూర్తి, సత్యనారాయణ, చంద్రన్న, ప్రభుదాస్, రామచంద్రయ్య, రాజబాబు, సతీష్ కుమార్, శివ నారాయణ, సుబ్బారావు త‌దిత‌రులు పాల్గోన్నారు.

➡️