- జిఓ ఆర్‌టి నెంబరు 321 విడుదల
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం మరమ్మతులు, ఇంటి హంగులు, వివిఐపి సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.1.44 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం రోడ్లు భవనాల శాఖ జిఓ ఆర్‌టి నెంబరు 321ని విడుదల చేసింది. ఇందులో సోలార్ ఫెన్సింగ్ కోసం రూ.21 లక్షలు, నివాసం లోపల, బయట నిఘా కోసం రూ.81 లక్షలతో సిసి కెమెరాలు, సిఎం ఇంటికి వచ్చే వాహనాల తనిఖీలు, నియంత్రణ, యువిఎస్‌ఎస్, హైడ్రాలిక్ బోలార్డ్స్ కోసం రూ.42 లక్షలు ఆర్‌అండ్‌బి శాఖ ఖర్చు పెట్టనుంది.