సాస్కి ద్వారా రూ.113 కోట్లు విడుదల

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అఖండ గోదావరి, గండికోట అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ పథకం ‘సాస్కి’ ద్వారా రూ.113.75 కోట్లు విడుదల అయ్యాయని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ఆర్ధిక శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ నిధుల విడుదలతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి నూతనోత్తేజం వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం తరపున సంబంధిత ప్రాజెక్టుల డిపిఆర్‌లను కేంద్రానికి సమర్పించామని తెలిపారు.

➡️