అనకాపల్లి ప్రమాద బాధితులకు రూ.15 లక్షల పరిహారం

ప్రజాశక్తి-అమరావతి : అనకాపల్లి జిల్లాలో బాణా సంచా కేంద్రంలో పేలుడు సంభవించడంతో ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ క్రమంలో బాధితులకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.15 లక్షల చొప్పున హోంమంత్రి అనిత ప్రకటించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

➡️