గిరిజన విద్యా సంస్థల సొసైటీకి రూ.340 కోట్లు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీకి ఆర్థికశాఖ రూ.340 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో క్వార్టర్‌కు రూ.85 కోట్ల చొప్పున నాలుగు క్వార్టర్లకు మొత్తం రూ.340 కోట్లుగా పేర్కొన్నారు. విద్యార్థులకు చెల్లించే డైట్‌ ఛార్జీలకు రూ.112.06 కోట్లు, ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.98.71 కోట్లు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల కోసం రూ.6 కోట్లు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల కోసం రూ.54.06 కోట్లుగా, భవనాల అద్దెలు, పన్నులకు రూ.87 లక్షలు, అద్దె వాహనాలకు రూ.13.17 లక్షలు, ఇతర ఖర్చులకు ఈ మొత్తం నిధులు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిధులను విభాగాధిపతులు సమర్ధవంతంగా వినియోగించాలని ఆదేశించారు.

➡️