బోల్తాపడ్డ ఆర్‌టిసి బస్సు : పలువురికి గాయాలు

Dec 17,2023 13:01 #injured, #overturned, #RTC BUS

ప్రజాశక్తి-చల్లపల్లి (కృష్ణా) : చల్లపల్లి మండలం మేకవారిపాలెం సమీపంలో ఆదివారం ఉదయం అవనిగడ్డ నుండి విజయవాడకు వెళుతున్న ఆర్టీసీ బస్సు పంట బోధిలోకి దూసుకుపోయి బోల్తా కొట్టడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ప్రధమ చికిత్స నిమిత్తం 108 ద్వారా స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. చల్లపల్లి సిఐ సిహెచ్‌ నాగ ప్రసాద్‌, ఎస్సై చినబాబు సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్‌ ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ … ప్రమాదకరంగా ఉన్న రోడ్లను అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నిత్యం ఎంతోమంది గాయపడుతున్నా ఈ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. తక్షణమే రోడ్లు అభివఅద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్టీసీ డీఎం మాట్లాడుతూ … ఆర్టీసీ బస్సు కండిషనులోనే ఉందని, ప్రమాదానికి కారణాలు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

➡️