మంత్రి ఆదేశాలు బేఖాతరు – ఆర్‌టిసి ఈడీపై బదిలీ వేటు

అమరావతి : ఉద్యోగుల సమస్య పరిష్కార విషయమై మంత్రి మూడుసార్లు ఫోన్‌ చేసినప్పటికీ ఎపిఎస్‌ఆర్‌టిసి ఉన్నతాధికారి ఆ ఫోన్లకు స్పందించలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఆర్‌టిసి ఈడి పై బదిలీ వేటు వేశారు. ఉద్యోగుల సమస్య పరిష్కార విషయమై కడప జోన్‌ ఈడీ గిడుగు వెంకటేశ్వరరావుకు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి మూడుసార్లు ఫోన్‌ చేశారు. అయితే మంత్రి ఆదేశాలను ఉన్నతాధికారి ఖాతరు చేయలేదు. ఈడీ లెక్కచేయకపోవడంతో ఆయన తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశించారు. దీంతో ఈడీపై బదిలీ వేటు వేస్తూ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే ఆదేశాలు జారీ చేశారు.

➡️