తెలంగాణ : ఫ్లాట్ల కొనుగోలులో మోసానికి పాల్పడ్డారని ఆరోపణలతో సాహితీ ఇన్ఫ్రా ఎండి లక్ష్మీ సత్యనారాయణ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో సాహితీ రియల్ ఎస్టేట్ ప్రీ-లాంచింగ్ పేరుతో ఆయన మోసాలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆదివారం మధ్యాహ్నం నుండి లక్ష్మీనారాయణ నుండి స్టేట్మెంట్లు తీసుకున్న ఈడి అధికారులు నేడు(సోమవారం) నాంపల్లి కోర్టులో హాజరు పరచనున్నారు. ఆయనపై వేయికి పైగా పిటిషన్ బాధితులు దాఖలు చేశారు. దాదాపు 3వేల కోట్ల స్కాం జరిగినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఫ్లాట్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.