- 33 మందితో సభ్యుల ప్రకటన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి పొలిటికల్ అడ్వైజరీ కమిటీ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ నియమించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కమిటీ సభ్యుల పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసింది. పిఎసి సభ్యులుగా తమ్మినేని సీతారాం, పీడిక రాజన్నదొర, బెల్లాన చంద్రశేఖర్, గొల్ల బాబురావు, బూడి ముత్యాలనాయుడు, పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్, తోట త్రిమూర్తులు, ముద్రగడ పద్మనాభం, పుప్పాల శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు, కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, కోన రఘుపతి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నందిగం సురేష్, ఆదిమూలపు సురేష్, పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కళత్తూరు నారాయణ స్వామి, ఆర్‌కె రోజా, వైఎస్ అవినాష్ రెడ్డి, షేక్ బెపారి అంజాద్ బాషా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అబ్దుల్ హఫీజ్ ఖాన్, మాలగుండ్ల శంకరనారాయణ, తలారి రంగయ్య, వై విశ్వేశ్వర రెడ్డి, మహాలక్ష్మి శ్రీనివాస్, సాకే శైలజానాథ్ ఉన్నారు. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు పిఎసి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.