సజ్జల భార్గవ్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

ప్రజాశక్తి-అమరావతి :  సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టింగ్‌లు పెట్టించారంటూ దాఖలైన కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ సోషల్‌ మీడియా మాజీ ఇంఛార్జ్‌ సజ్జల భార్గవ్‌ రెడ్డి పిటిషన్‌ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం వాదనలు జరిగాయి. సీనియర్‌ లాయర్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదిస్తూ, నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పిటిషనర్‌పే వేర్వేరు పీఎస్‌ల్లో వివిధ కేసుల్లో నిందితుడిగా చేర్చడం అన్యాయమన్నారు. బీఎన్‌ఎస్‌ చట్టం అమలులోకి రాకముందు నాటి ఘటనలపై కేసు నమోదు చెల్లదన్నారు.బీఎన్‌ఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 111ను పోలీసులు దుర్వినియోగం చేశారన్నారు. తదుపరి విచారణ ఈ నెల 29న జరుపుతామని జస్టిస్‌ వీఆర్‌కే కపాసాగర్‌ ప్రకటించారు.

➡️