కోచ్‌లకు వేతన బకాయిలు చెల్లించాలి : డివైఎఫ్‌ఐ

Jul 10,2024 23:10 #DYFI, #paid to coaches, #wage arrears

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌)లో పనిచేస్తున్న కోచ్‌లకు తక్షణం వేతన బకాయిలు చెల్లించాలని డివైఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు డివైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 2017 నుంచి అవుట్‌సోర్సింగ్‌లో శాప్‌లో 97 మంది కోచ్‌లు పనిచేస్తున్నారని తెలిపారు. వీరెవరికీ కనీస వేతనాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన శాప్‌లో రెగ్యులర్‌ కోచ్‌లు లేకపోవడం అన్యాయమన్నారు. శాప్‌లో కేవలం 13 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు వున్నారని పేర్కొన్నారు. అవుట్‌సోర్సింగ్‌లో పనిచేసే కోచ్‌లకు కేవలం రూ.19,500 వేతనంగా ఇస్తున్నారని, తక్షణం వీరికి మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే కోచ్‌లకు ఐదు నెలలుగా వున్న వేతన బకాయిలు వారు కోరారు. కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న కోచ్‌లను తక్షణం రెగ్యులర్‌ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

➡️