సత్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యే
పెద్ద చెరువు ప్రాంతంలో స్వచ్చ హి సేవ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : గాంధీ జయంతి సందర్భంగా బుధవారం విజయనగరంలో ఎన్.సి.ఎస్. వద్ద జిల్లా కలెక్టర్ డా బి ఆర్ అంబేద్కర్, స్థానిక శాసన సభ్యురాలు అదితి గజపతిరాజు మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు సత్కరించారు. అనంతరం పరిసరాలను పరిశుభ్రంగా వుంచుతామనే జిల్లా కలెక్టర్ డా అంబేడ్కర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమం అనంతరం స్వచ్చత హి సేవ కార్యక్రమంలో బాగంగా
పెద్ద చెరువు వద్ద పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమంలో స్వ కలెక్టర్ అంబేద్కర్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు.
కార్యక్రమంలో జనసేన నాయకురాలు పాలవలస యశస్విని, మునిసిపల్ కమిషనర్ నల్లనయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు అవనాపు .విజయ్ తదితరులు పాల్గొన్నారు.