ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నూతన గవర్నర్‌గా రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌బిఐ 26వ గవర్నర్‌గా బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ గవర్నర్‌గా సేవలందించిన శక్తికాంత దాస్ పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈ హోదాలో మల్హోత్రా మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.
