సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతి – తెలంగాణలో ఫిబ్రవరి 15న సెలవు

Feb 10,2024 11:35 #15, #February, #holidays, #Jayanti, #Telangana

తెలంగాణ : బంజారాలు పూజించుకునే సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ జయంతిని పురస్కరించుకుని … తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 15వ తేదీని సెలవు దినంగా ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ … వచ్చే జయంతి నాటికి రాజధాని హైదరాబాద్‌లో మహరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలోని అన్ని వర్గాలవారి అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ట్యాంక్‌ బండ్‌ పై సేవాలాల్‌ మహరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్సీ రాముల్‌ నాయక్‌ ప్రభుత్వాన్ని కోరగా కోమటిరెడ్డి స్పందించారు.

➡️