తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం

తిరుమల: తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 8 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు 8 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 70,815 మంది యాత్రకులు దర్శించుకోగా 25,245 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.16 కోట్లు వచ్చిందని వివరించారు.

➡️