సిపిఎం సీనియర్‌ నాయకులు సత్యనారాయణ రాజు కన్నుమూత

  • అరటికట్లలో విషాద ఛాయలు

ప్రజాశక్తి – పాలకొల్లు : సిపిఎం సీనియర్‌ నాయకులు, వ్యవసాయ కార్మిక ఉద్యమ నేత కూనపరాజు సత్యనారాయణరాజు (సత్తిరాజు) (80) మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం అరట్లకట్ట గ్రామాంలోని ఆయన స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. ఆయనకు భార్య సత్యవతి, కుమారుడు సుందరయ్య ఉన్నారు. సత్తిరాజు తుదిశ్వాస వరకూ సిపిఎం కార్యకర్తగా పనిచేశారు. ఆయన భార్య సత్యవతితో వ్యవసాయ కార్మికుల జీవనగతులు పెంచడానికి నిత్యం పోరాటం చేశారు. రైతు సంఘం ఉపాధ్యక్షుడు వలవల శ్రీరామ్మూర్తి, సిపిఎం మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, సిపిఎం నేతలు పార్టీ జెండాను సత్తిరాజు మృతదేహంపై కప్పి నివాళులర్పించారు. ఆయన వ్యవసాయ కార్మిక ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడారు. సత్తిరాజు అంత్యక్రియలను కుటుంబ సభ్యులు ఆదివారం సాయంత్రం నిర్వహించారు.
వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం సంతాపం..
సత్తిరాజు మృతి పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి వెంకట్‌, రాష్ట్ర కార్యదర్శి వి వెంకటేశ్వర్లు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం, సిపిఎం మాజీ ఎమ్మెల్యే రుద్రరాజు సత్యనారాయణ రాజు (ఆర్‌ఎస్‌), మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్‌, సిపిఎం సీనియర్‌ నాయకులు జుత్తిగ నర్సింహమూర్తి, కేతా సూర్యారావు, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ రవి, మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్‌, సిపిఎం నాయకులు సిహెచ్‌ సోమేశ్వరరావు, కె బలరాం, టి కోటేశ్వరరావు, తిరుమల రాజు, వలవల రవి సంతాపం తెలిపారు.
సత్తిరాజు సిపిఎం పూర్తికాలం కార్యకర్తగా, నర్సాపురం, పాలకొల్లు డివిజన్‌ కమిటీ సభ్యునిగా, వ్యవసాయ కార్మిక సంఘం డివిజన్‌ నాయకునిగా అంకితభావంతో, క్రమశిక్షణతో పనిచేశారని సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సత్తిరాజు ఇటీవల ప్రమాదంలో గాయపడడంతో కాలికి సర్జరీ జరిగి చాలా ఇబ్బంది పడి కోలుకుంటున్న తరుణంలో ఆకస్మికంగా మృతి చెందారని తెలిపారు. ఆయన మృతి సిపిఎంకు, ప్రజా సంఘాలకు, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. సత్తిరాజుకు సిపిఎం జిల్లా కమిటీ తరపున ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

వ్యవసాయ కార్మిక సంఘం సంతాపం
సత్తిరాజు మృతి పట్ల అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, సిపియం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి తీవ్ర సంతాపం తెల్పి జోహార్లు అర్పించారు. సత్తిరాజు మృతి పట్ల సంతాపం తెలిపిన వారిలో మండల కార్యదర్శి జవ్వాది శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, సిహెచ్ సోమేశ్వరరావు తదితరులు ఉన్నారు.

➡️