ప్రజాశక్తి – తిరుమల : టిటిడి ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యునిగా రాష్ట్ర దేవాదాయ శాఖ సెక్రటరీ (ఎఫ్‌ఎసి), కమిషనర్ ఎస్.సత్యనారాయణ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. టిటిడి అడిషనల్ ఇఒ సి.హెచ్.వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సత్యనారాయణకు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అడిషనల్ ఇఒ అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, పేష్కార్ రామకృష్ణ పాల్గొన్నారు.
