ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఈ నెల 31లోపు ఇకెవైసి ప్రక్రియ పూర్తి చేసేలా కృషి చేయాలని అధికారులను పౌరసరఫరాలశాఖ కమిషనరు సౌరబ్‌గౌర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లు, పౌరసరఫరాలశాఖ అధికారులకు తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. ఇకెవైసి యూనిట్లు రేషన్ డీలర్లు, తహశీల్దార్లు, డిఎస్‌ఒల లాగిన్‌లలో యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మొబైల్ యాప్, రేషన్ షాపుల్లోని ఈ పోస్ పరికరాల ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు ఇకెవైసి నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
