- వల్లభనేని వంశీ కేసులో హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి : వైసిపి నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై నమోదు చేసిన కేసుకు సంబంధించి పటమట పోలీస్ స్టేషన్‌లోని సిసిటివి ఫుటేజీని భద్రపరచాలని హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి 15వ తేదీ వరకు పోలీస్ స్టేషన్ లోపల, ఆవరణలోని సిసిటివి ఫుటేజీని భద్రపరచాలని స్పష్టం చేసింది. పటమట పోలీస్ స్టేషన్‌లోసి సిసిటివి ఫుటేజీని భద్రపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ వంశీ సతీమణి పంకజశ్రీ పిటిషన్ నేపథ్యంలో పటమట ఎస్‌హెచ్‌ఒకు జస్టిస్ ఎన్.హరినాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.