విజయవాడ : సవ్యసాచి మోటూరు హనుమంతరావు 23వ స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రదానోత్సవ సభ మంగళవారం ఉదయం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు బి.తులసీదాస్ వ్యవహరించారు. ముందుగా ప్రజానాట్యమండలి, ప్రజాశక్తి సిబ్బంది గానాలాపన చేశారు. ఆ తరువాత సభా వేదికపై ఉన్నవారంతా ఎం హెచ్ , బొమ్మా రెడ్డి చిత్రపటాలకు పూలమాలలేసి శ్రద్దాంజలి ఘటించారు. గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కొలుసు పార్థసారధి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రజాశక్తి 44వ వార్షికోత్సవ సంచికను ఆవిష్కరించనున్నారు. విశిష్ట అతిథిగాగా శాసనమండలి సభ్యులు కెఎస్.లక్ష్మణరావు పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఎంహెచ్ అవార్డు ఎంపిక కమిటీ చైర్మన్ తెలకపల్లి రవి, నాగార్జున యూనివర్సిటీ, జర్నలిజం విభాగం అధిపతి ప్రొఫెసర్ జి.అనిత, కవి, సీనియర్ పాత్రికేయులు నల్లి ధర్మారావు, ప్రజాశక్తి సిజిఎం వై.అచ్చుతరావు అవార్డులను పరిచయం చేయనున్నారు.
