రాష్ట్ర యూనిట్‌గా ఎస్‌సి వర్గీకరణ

Mar 13,2025 22:15 #AP Reorganization Bill

– ఎంఆర్‌పిఎస్‌ జాతీయ నాయకులు బ్రహ్మయ్య డిమాండ్‌
ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎస్‌సి వర్గీకరణను అమలు చేసి చట్టబద్ధత కల్పించాలని ఎంఆర్‌పిఎస్‌ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గురువారం మంగళగిరి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జిల్లా యూనిట్‌గా వర్గీకరణ అనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకొని దేశంలో ఆయా రాష్ట్రాల వలే రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ అమలు చేయాలని కోరారు. జిల్లా యూనిట్‌గా వర్గీకరణ చేస్తే మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, వర్గీకరణ చేసినా కూడా ఉపయోగం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం అందించే విధంగా రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని వర్గీకరణ చట్టం అమలు చేయుటకు నిర్దిష్ట చర్యలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఎంఆర్‌పిఎస్‌ రాష్ట్ర కన్వీనర్‌ ఏటుకూరు విజయ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️