మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసటీ కేసు

May 14,2024 20:50 #Case, #raghu rami reddy, #sc st

ప్రజాశక్తి – చాపాడు (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డిపై మంగళవారం కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా ఆయన అనుచరులు 11 మందిపై పోలీసులు ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సోమవారం పోలింగ్‌ సందర్భంగా చాపాడు మండల పరిధిలోని చిన్నగులవలూరులో ఇద్దరు టిడిపి ఏజెంట్లు కుచ్చుపాప ఉగ్ర నరసింహులు, వినోద్‌లపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఇరువురికీ బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని కర్నూలు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డితోపాటు పాలగిరి లక్ష్మీనారాయణరెడ్డి, మనీష్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, సగిలి చంద్ర ఓబుళరెడ్డి, గంజికుంట హర్షవర్ధన్‌రెడ్డి, బోర్రా శంకర్‌రెడ్డి, ఏరాశి భాస్కర్‌రెడ్డి, పాలగిరి చంద్రమోహన్‌రెడ్డి, చంగా చంద్ర ఓబుల్‌రెడ్డిలపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, సోమవారం ఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్‌పి సిద్ధార్థ్‌ కౌశల్‌ వంద మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తామని చెప్పారు. 11 మందిపైనే కేసు నమోదు చేశామని చెప్పడం వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

➡️