13న బడులు తెరుస్తారు

Jun 10,2024 08:08 #andrapradesh, #re open, #schools

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : పాఠశాలలకు వేసవి సెలవులు ఒకరోజు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11వ తేదీ వరకూ సెలవులు ఉన్నాయి. 12వ తేదీన పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉంది. అదేరోజు చంబ్రాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో ఒకరోజు పొడిగించాలని పలువురు విజ్ఞప్తులు చేశారు. దీంతో పాఠశాలలు 13వ తేదీన తెరుచుకుంటాయని విద్యాశాఖ ప్రకటించింది.

➡️