జూన్‌ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం

May 25,2024 18:17 #reopen, #schools, #Telangana

హైదరాబాద్‌ : 2024-25 విద్యాసంసత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను తెలంగాణ విద్యాశాఖ విడుదల చేసింది. జూన్‌ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలు పున్ణప్రారంభం 2025 ఏప్రిల్‌ 23 వరకు పాఠశాలల తరగతులు జరగనున్నాయి. అలాగే 2025 ఫిబ్రవరి 28 లోపు పదో తరగతి ప్రి ఫైనల్‌ పరీక్షలు పూర్తి. మార్చిలో పదో తరగతి పరీక్షలు, అలాగే అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు, డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు క్రిస్మస్‌ సెలవులు, జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అలాగే పాఠశాలకు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు, అప్పర్‌ ప్రైమరీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కాగా గత సంవత్సరం తో పోల్చుకుంటే ఈ సంవత్సరం క్రిస్మస్‌ సెలవులను ప్రభుత్వం భారీగా పెంచింది.

➡️