ఆర్‌టిసికి స్కాచ్‌ అవార్డు

Nov 30,2024 23:43 #aps rtc, #RTC, #Scotch Award
పండుగకు ఆర్‌టిసి ప్రత్యేక బస్సులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసి ప్రతిష్టాత్మకమైన స్కాచ్‌ అవార్డు సాధించిందని ఆ సంస్థ అధికారులు తెలిపారు. యాప్‌తో నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టిక్కెట్ల జారీ విధానాన్ని అమలు చేయడం, సంస్థలోని అన్ని బస్సులకూ ట్రాకింగ్‌ వ్యవస్థలోకి తీసుకురావడం వంటి అధునాతన సాంకేతిక విధానాలను అమలు చేయడం వల్ల ఈ అవార్డు లభించిందని సంస్థ ఇడి శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ వై శ్రీనివాసరావు అవార్డును అందుకున్నారని తెలిపారు.

➡️