ఎమ్మెల్సీ నామినేషన్ల పరిశీలన పూర్తి

Mar 12,2025 23:07 #ap mlc, #election
  • ఐదుగురి నామినేషన్లకు ఆమోదం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : శాసన మండలిలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఐదు స్థానాలకు ఐదుగురు అభ్యర్ధులు అందించిన నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వనితారాణి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. పరిశీలన అనంతరం టిడిపి అభ్యర్ధులు కావలి గ్రీష్మ ప్రసాద్‌, బి.తిరుమల నాయుడు, బీదా రవిచంద్ర, జనసేన అభ్యర్ధి కె.నాగేంద్రబాబు, బిజెపి అభ్యర్ధి సోము వీర్రాజు నామినేషన్లు నిబంధనల ప్రకారం చెల్లుబాటు అయ్యేవిగా ఉండటంతో శాసన సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నామినేషన్లను ఆమోదించారు.

➡️