విసిల నియామకానికి సెర్చ్‌ కమిటీలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్‌ ఛాన్సలర్‌ పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్‌ బుధవారం విడుదల చేశారు. మొత్తం 17 యూని వర్సిటీలకు సెర్చ్‌ కమిటీలను ఏర్పాటుచేశారు. ముగ్గురితో కూడిన ఈ సెర్చ్‌ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, యుజిసి నుంచి ఒకరు, యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఇసి) నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారు. యూనివర్సిటీ విసి పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ముగ్గురి పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కమిటీ ప్రతిపాదిస్తుంది.

➡️