ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి సచివాలయ ఉద్యోగి మృతి

ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం) : ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి సచివాలయ ఉద్యోగి మృతి చెందిన సంఘటన మార్కాపురం పట్టణంలోని పంచాయతీరాజ్‌ కార్యాలయం సమీపంలో శనివారం ఉదయం జరిగింది. నంద్యాల జిల్లా సున్నిపెంట స్వగ్రామానికి చెందిన బేతం మల్లయ్య (34) మార్కాపురం మున్సిపాలిటీలోని 12వ సచివాలయంలో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ గా పని చేస్తున్నారు. అతనికి వివాహం కాలేదు. ఈరోజు ఉదయం ప్రమాదవశాత్తూ మల్లయ్య భవనం పై నుండి కిందికిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వెంటనే మార్కాపురంలోని ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో చేర్పించారు. అతడి పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ ఘటనపై మార్కాపురం పట్టణ ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️