ప్రజాశక్తి – మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యాన్ని సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ టోల్‌గేట్ వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహశీల్దార్ దుర్గారావు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు నుండి నెల్లూరు జిల్లాకు రేషన్ బియ్యం రవాణా అవుతున్నట్లు సమాచారం అందుకున్న విజిలెన్స్, సివిల్ సప్లయీస్, రెవెన్యూ అధికారులు టోల్‌గేట్ వద్ద నిఘా ఉంచారు. బియ్యాన్ని లారీలో తరలిస్తుండగా తనిఖీలు చేసి పట్టుకున్నారు. 620 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.11.78 లక్షలు ఉంటుందని అంచనా. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని మంగళగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్రమ రవాణా వెనుక ఎవరున్నారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ సిఐ ఎ శ్రీహరి, విఆర్‌ఒ రామారావు పాల్గన్నారు.
