సిపిఐ సీనియర్‌ నాయకులు సాంబశివరావు మృతి

ప్రజాశక్తి-మంగళగిరి (గుంటూరు) : పాత మంగళగిరికి చెందిన సిపిఐ సీనియర్‌ నాయకులు మర్రి సాంబశివరావు (77) సోమవారం రాత్రి మృతి చెందారు. సాంబశివరావు కు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు సాంబశివరావు భౌతికకాయం పై వివిధ పార్టీలకు చెందిన నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఎం సీనియర్‌ నాయకులు జె.రాఘవులు, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌ఎస్‌.చంగయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు పి.బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వై.కమలాకర్‌, సిపిఎం నాయకులు డి.రామారావు, గోలి దుర్గాప్రసాద్‌, ఏం.చలపతిరావు, వద్దంటి సోమేశ్వరరావు, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, కంచర్ల కాశయ్య, జాలాది జానుబాబు, టిడిపి నాయకులు నందం అబద్దయ్య, జి.ధనంజయరావు, కే.అంకమ్మరావు, తదితరులు పూలమాలవేసి నివాళులర్పించారు.

➡️