ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: మద్యం సరఫరాపై పూర్తి స్థాయి పర్యవేక్షణకు ట్రాక్ అండ్ ట్రేస్ విధానాన్ని తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం, ఇందుకోసం వివిధ శాఖాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీలో ఎక్సైజ్‌శాఖ నుంచి డైరెక్టర్, ఆర్థికశాఖ నుంచి అదనపు కార్యదర్శి, ఐటిఇ అండ్ సి శాఖ నుంచి డైరెక్టర్ (కమ్యూనికేషన్స్), ఐఅండ్‌సి శాఖ నుంచి అదనపు డైరెక్టర్‌ను కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీ విషయ నిపుణులు కావాలని భావిస్తే ఒకరిని నియమించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీ ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ నుంచి ప్రతిపాదన కోసం అభ్యర్థన (ఆర్‌ఎఫ్‌పి)ను స్వీకరించి, 15 రోజులలోగా తన సిఫార్సులను సమర్పించాలని ఆదేశించారు.
