అమరావతి : ఏడుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్ .కఅష్ణయ్య, బీద మస్తాన్ రావు పార్టీ వీడుతున్నట్లు సమాచారం. వీరందరూ రాజీనామా చేస్తే వైసీపీకి మిగిలేది మరో నలుగురు ఎంపీలే. గురువారం మోపిదేవి, మస్తాన్ రావు తమ రాజీనామా పత్రాలను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించనున్నారు.
