ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఏడుగురు అడిషనల్ ఎస్‌పిలకు నాన్‌కేడర్ ఎస్‌పిలుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడిషనల్ ఎస్‌పిలు ఎం కృష్ణమూర్తి నాయుడు, టి శోభా మంజరి, బి ప్రసాదరావు, పివిఆర్‌ఎస్‌ఎస్ వర్మ, పి సోమశేఖర్‌రావు, కెవిఆర్‌కె ప్రసాద్, ఎస్ రాజశేఖర్‌రావు, కె చక్రవర్తికి నాన్‌కేడర్ ఎస్‌పిలుగా ఉద్యోగోన్నతి కల్పించారు.
ఎఎస్‌పిలుగా 30 మందికి ఉద్యోగోన్నతి
30 మంది డిఎస్‌పిలను అడిషనల్ ఎస్‌పిలుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ విడుదల చేశారు. ఎన్ సురేంద్ర, పి నాగరాజరెడ్డి, వివి నాయుడు, జె రమేష్‌రెడ్డి, కె శ్రీనివాసులు, ఎ శ్రీనివాసులు, ఎం వెంకటాద్రి, ఎన్ యుగంధర్‌బాబు, జి హుస్సేన్‌పీరా, కె జనార్ధన్ నాయుడు, ఎం మోహన్‌రావు, ఎల్ నాగేశ్వరి, పి శ్రీనివాసరావు, కె విజరుపాల్, ఎం రాజారావు, ఎల్ మోహన్‌రావు, ఎ త్రినాథరావు, ఎన్‌బిఎమ్ మురళీకృష్ణ, ఐ రామకృష్ణ, కె ప్రకాష్‌బాబు, కెఎస్ వినోద్‌కుమార్, వై మల్లేశ్వరరెడ్డి, జి వీరరాఘవరెడ్డి, వై శ్రీనివాసరెడ్డి, పి వీరాంజనేయరెడ్డి, ఎఎస్ చక్రవర్తి, కెవి రమణ, పి విజరుకుమార్, కె ప్రభాకర్, కె రవి మనోహర ఆచారి, బి నాగభూషణ్‌రావు, వి గోపాలకృష్ణ, పి సౌమ్యలత, ఎం మహేంద్రకు అడిషనల్ ఎస్‌పిలుగా ఉద్యోగోన్నతి లభించింది.