రెండవ ఘాట్‌ రోడ్డులో బస్సు ప్రమాదం

  • పలువురు యాత్రికులకు గాయలు

ప్రజాశక్తి -తిరుమల: తిరుమల ఘాట్‌ రోడ్డులో సోమవారం బస్సు ప్రమాదం జరిగింది. రెండో ఘాట్‌ రోడ్డులో వెళ్తున్న ఆర్‌టిసి బస్సు పిట్ట గోడను ఢకొీంది. ఆ సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో కొంతమందికి గాయాలు కాగా దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్‌కు తరలించారు. ఈ ప్రమాదం వల్ల ఘాట్‌ రోడ్డులో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి తీవ్రంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, ట్రాఫిక్‌ సిబ్బంది క్రేన్‌ సాయంతో బస్సును తొలగించే చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఆర్‌టిసి అధికారులు విచారణ చేపట్టారు. తిరుమల ట్రాఫిక్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

➡️