చేనేతలకు తీవ్ర అన్యాయం

  • ఎపి చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాలకృష్ణ

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : కేంద్ర బడ్జెట్లో చేనేతకు కేవలం రూ.200 కోట్లు కేటాయించడం ద్వారా ఆ రంగానికి తీవ్ర అన్యాయం చేశారని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ విమర్శించారు. ఏడాదికి రూ.5 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి ఇప్పుడు మోసం చేశారన్నారు. 45 లక్షల గ్రామీణ కుటుంబాలు ఆధారపడిన ఈ రంగానికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. చేనేత కుటుంబాలకు అవసరమైన విధానాలు కూడా రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని తెలిపారు.

➡️