SFI: విద్యార్దుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

ఎస్ ఎఫ్ ఐ నాయకులపై పోలీసులు దౌర్జన్యం
మున్సిపల్ హైస్కూల్లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా.
పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు అరెస్ట్.
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విజయనగరం పట్టణంలో ఉన్న మున్సిపల్ హై స్కూల్లో సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎమ్మార్వో ఆఫీస్ వరకు చేపట్టారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ర్యాలిని అడ్డుకున్నారు. ఎస్ ఎఫ్ ఐ నాయకులను బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు.దీంతో నాయకులు అక్రమంగా ర్యాలీని అడ్డుకోవడాన్ని నిరసించారు. దీంతో పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించారు .నాయకులను అరెస్టు చేసిన విద్యార్దులు ర్యాలీగా వెళ్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి రాము, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు జె .రవికుమార్, పట్టణ నాయకులు గుణ, వాసు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా అనంతరం డిప్యూటీ ఎమ్మార్వోకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కె రాజు, పి.రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విజయనగరం పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వం అయినా ఆ సమస్యలో పరిష్కారం చేస్తాయని ఇన్నాళ్లు వేచి చూసామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. స్థానిక బిపిఎం పాఠశాలలో చిన్న వర్షం పడితేనే గ్రౌండ్ మొత్తం చెరువుల్ని తలపిస్తోందని గ్రౌండ్లో మట్టివేసి ఎత్తు చేయాలని కోరారు. అదేవిధంగా ఆ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్మాణం చేసిన ఇప్పటివరకు డోర్లు బిగించడం గాని టాపులు బిగించడం కానీ చేయలేదని వాటిని వినియోగంలోకి తేవాలని కోరారు. త్రాగునీరు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కస్పా పాఠశాలలో మరుగుదొడ్లకు తాళాలు వేసే పరిస్థితి దాపురించిందని ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం కూడా అధ్వానంగా ఉంటుందని విమర్శించారు. గాజులరేగ, కంటోన్మెంట్ హైస్కూల్ నందు తరగతి గదులు సరిపడా లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట చదువుకునే పరిస్థితి ఉందని విమర్శించారు. తక్షణమే అధికారులు ఈ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కోరారు. ఇదే సందర్భంలో సమస్యల కోసం వినతి ఇవ్వడానికి వస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు అక్రమంగా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టులు చేయడం దుర్మార్గమని తక్షణమే అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలపై ఈనెల 6న జరగబోయే చలో కలెక్టరేట్ ని జిల్లాలో ఉన్న విద్యార్థులందరూ జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భారతి, రాహుల్, ఎర్రమ్మ, మురళి, శిరీష, చిరు తదితరులు పాల్గొన్నారు.

 

➡️