యూకే పార్లమెంటు బరిలో శనిగరం వాసి

May 16,2024 11:15 #Shanigaram Vasi, #UK Parliament

కోహెడ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు ఉదరు యూకే పార్లమెంట్‌ ఎన్నికల బరిలో నిలిచారు. హన్మంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు నాగరాజు.. యూకేలోని ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. నార్త్‌ బెడ్‌ఫోర్డ్‌షైర్‌ స్థానం నుంచి ఆయన పోటీ పడనున్నారు. నాగరాజు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు బంధువు. తమ మండలవాసి యూకే పార్లమెంటు అభ్యర్థిగా బరిలో ఉండటంపై కోహెడ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

➡️