వైఎస్‌ విగ్రహాలపై దాడులు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి : షర్మిల

Jun 9,2024 19:56 #ys sharmila, #ysr statue

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్‌ విగ్రహాలపై దాడులు చేస్తున్న అల్లరి మూకలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం, శోచనీయమని పేర్కొన్నారు. తెలుగు వారి ప్రజాదరణ పొందిన నాయకుడు వైఎస్‌ఆర్‌ అని, అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదని తెలిపారు. ఇలాంటి రౌడీ చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పేర్కొన్నారు.

➡️