- టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : అప్పు చేయడం తప్పు కాదని, కానీ దానిని ఎలా వినియోగించాలనే దానిపై స్పష్టత ఉండాలని నరసరావుపేట ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. సోమవారం నాడిక్కడ ఎపి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో టిడిపి ఎంపిలతో కలిసి మాట్లాడారు. 2019-2024 మధ్య రూ.100 అప్పు తీసుకుంటే రూ.24 మాత్రమే మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశారని నీతి ఆయోగ్ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. 2,369 పిఎంఎస్ స్కూల్స్ కావాలని అడిగామని, కానీ 530 స్కూల్స్ మాత్రమే ఇచ్చారని అన్నారు. జలశక్తికి కేంద్రం కేటాయించిన నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. గోదావరి నుంచి పెన్నా నది వరకు కావాల్సిన నిధులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడకు మెట్రో వెసులుబాటు కల్పించాలని విభజన చట్టంలో ఉందని ఆయన పేర్కొన్నారు.