తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ6గా ఉన్న శ్రవణ్ రావు నాలుగోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు వచ్చారు. గత ఏడాది మార్చి 29వ తేదీన శ్రవణ్ రావు విదేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈక్రమంలో పలుమార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. నేడు ఆయన ఫోన్లలోని డేటాను అధికారులు రీట్రీవ్ చేస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశారు ? దాని వల్ల జరిగిన లబ్ధిపై అధికారులు ఆరా తీస్తున్నారు. శ్రవణ్ ఇచ్చే వివరాలను బట్టి భవిష్యత్తులో కొందరు రాజకీయ నేతలను అధికారులు విచారించే అవకాశం ఉంది.
