చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు ఎస్‌ఐ‌పీబీ సమావేశం

అమరావతి :  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌లో స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) 4వ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థల ప్రతిపాదనలపై చర్చ జరిగింది. ఈ సమావేవంలో  10 సంస్థల ద్వారా వచ్చే ఒక లక్ష 21 వేల 659 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 80 వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. గత మూడు ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టులు, వాటి స్థితి గతులపై అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం.. ప్రాజెక్టుల అనుమతులు, క్షేత్ర స్థాయి పనులపై ట్రాకర్ ద్వారా మానిటిరింగ్ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

➡️